Monday, December 30, 2019

Kerala’s Breast Tax And The Story Of Nangeli/ కేరళ వక్షోజాలపై పన్ను,ఒక నగేలి కథ.

చరిత్ర పుటల్లోకి వెళ్తే ఎన్నో విషాధగాథలుంటాయి,18 వ శతాబ్దంలో ట్రావెన్కూర్ ( తిరువనంతపురం) ను పాలించిన రాజులు రకరకాల పన్నులను విధించేవారు, అవి చాలా దారునంగా ఉండేవి,ట్రావెన్‌కోర్ రాజులు స్త్రీల రొమ్ములపై కూడా పన్ను విధించేవారు,ఆ పన్ను చెల్లించడానికి మహిళలు చాలా ఇబ్బందులపడాల్సి వచ్చేది.

అవి కేరళను ట్రావెన్కోర్ మహారాజు మార్తాండ వర్మ పరిపాలిస్తున్న రోజులు. మార్తాండవర్మ వక్షోజాలపై పన్ను(ముళకరం)తో పాటు తలక్కారం అనే పన్ను కూడా విధించారు అంటే గడ్డాలు, మీసాలపై కూడా రాజు పన్ను విధించారు. అలాగే మహిళలు, పురుషులు ఆభరణాలు ధరించాలన్నా అప్పట్లో పన్ను కట్టాల్సిందే.

అప్పట్లో కేవలం ఉన్నత వర్గానికి చెందిన మహిళలు మాత్రమే వక్షోజాలపై దుస్తులు ధరించాలి. దళిత , గిరిజన , బడుగు , బలహీన వర్గాల మహిళలు వక్షోజాలపై వస్త్రాల్ని ధరించకూడదు,ఒకవేళ దిగువ వర్గానికి చెందిన మహిళలు స్తనాలు కనపడకుండా వస్త్రాలు ధరించాలంటే కచ్చితంగా రాజు అనుమతి తీసుకోవాలి,పన్ను కట్టనిదే రాజు అనుమతి ఇవ్వడు, అప్పటి కుల వివక్షతకు ఇదే నిదర్శనం, ఇందులో మరింత అసహ్యకరమైన అంశం ఏమిటంటే రొమ్ముల పరిమాణాన్ని బట్టి ఈ పన్నులో తేడాలుండేవట!దానికి ఆ రాజు లాజిక్కు ఏంటంటే ఎక్కువ పరిమాణంలో వక్షోజాలు ఉంటే వాళ్ళు బాగా తింటున్నారని, అలా తింటున్నారు అంటే సంపాదన బాగా ఉందని, అందుకే పన్ను కట్టాలని చెప్పేవారట,

ట్రావెన్కోర్ రాజ్యం లోని అలపుళా జిల్లా, చేర్తాల (చేరితాలా) గ్రామంలో కండప్పన్, నాంగేలి దంపతులు ఉండేవారు. వారు వ్యవసాయం చేసుకుని బతికేవారు. ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబం వీరిది.

అయితే రాజు నిబంధనలు నంగేళి కి నచ్చలేదు, సహజంగా వచ్చే వక్షోజాలపైన పన్ను ఏంటని ట్రావెన్ కోర్ రాజు ఆజ్ఞను నంగేళి దిక్కరించింది, అంతకు ముందు ఆమె కూడా వక్షోజాలపై ఎలాంటి వస్త్రంధరించకుండానే పొలం పనులు చేసుకునేది. గ్రామంలో తిరిగేది,కానీ ఆమెకు అలా వక్షోజాలను అందరికీ చూపించుతూ తిరగడం చాలా అవమానకరంగా బావించేది.

ఒకరోజు నంగేళి వక్షోజ పన్ను నేను కట్టను అని నిర్ణయించుకుంది, వక్షోజాలపై వస్త్రాన్ని ధరించింది. అలాగే పొలం పనులకు వెళ్లింది,ఆమె స్తనాలపై వస్త్రం ధరించిన విషయం ప్రజలందరికీ తెలిసిన కూడా ఆమె భయపడలేదు ఆ విషయం మహారాజు మార్తాండ్ వర్మకు తెలిసింది. నా ఆజ్ఞను నంగేళి అనే మహిళా దిక్కరిస్తుందా అని రాజుకు కోపం వచ్చింది. వెంటనే ప్రవతియార్ (టాక్స్ కలెక్టర్) ను పిలిపించాడు,ఏం చేస్తున్నారు మీరు? ఆ నంగేళి నుంచి పన్ను వసూలు చేసుకురండి అని మందలించాడు, రాజు దగ్గర అవమానం చెందిన ప్రవతియార్ ఎలాగైనా నంగేళి నుంచి పన్ను వసూలు చేయాలని బయల్దేరాడు.

నంగేలి వక్షోజ పన్ను వసూలు చేయడానికి ఆమె ఇంటివద్దకు వెళ్లిన ప్రవతియార్, రాజు ఆదేశాలను నంగేళి కి చెప్పాడు. రాజు అనుమతి లేకుండా పన్ను కట్టకుండా నువ్వు ఎలా వక్షోజాలను కప్పుతూ వస్త్రాలు ధరిస్తావు అంటూ ప్రవతియార్ మండిపడ్డాడు. వెంటనే పన్నుకట్లు అని నంగేలి ముందు అరటి ఆకును వేసాడు,

అప్పటికే రాజు పెట్టిన ఈ ఆచారంపై కోపంతో రగిలిపోతున్న నంగేలి,ప్రవతియార్ ఇంటికొచ్చి బెదిరించడం చూసి ఇప్పుడే వస్తాను అంటూ ఇంట్లోకి వెళ్లిన నంగేలి తన రెండు వక్షోజాలను కొడవలితో కోసీ పన్ను కోసం వేసిన అలటి ఆకులో ఉంచింది, 

తీవ్ర రక్తస్రావంతో ఆమే అక్కడే మరనించింది,నంగేలి వక్షోజాలను కోసుకుని వీర మరణం చెందిందనే విషయం ఆమె భర్త కండప్పన్ కు తెలియగానే ఆయన తట్టుకోలేకపోయాడు,నంగేలి దహన సంస్కారాలు  చేస్తున్న సమయంలో భర్త కండప్పన్ ఆమె చితిలోకి దూకాడు. ఇది దేశంలో జరిగిన మొట్టమొదటి పతీ సహగమనం.

దీంతో ట్రావెన్ కోర్ రాజ్యంలో నిరసలు మిన్నంటాయి,నంగేలి తిరుగుబాటుతో పెద్దదైన ఆ ఉద్యమం చన్నార్‌ తిరుగుబాటుగా పేరు పొంది అనేక పోరాటాల పిమ్మట అప్పటి బ్రిటిష్‌ మద్రాస్‌ గవర్నర్‌ జోక్యంతో ట్రావెన్కోర్ రాజు ములక్కారం , తలక్కారం పన్నులను రద్దుచేశాడు.

మహిళలందరూ ఛాతీపై వస్త్రం ధరించవచ్చనే చట్టం తేవడానికి ఆమే త్యాగం కారణమయింది. 

ఇప్పటికీ కేరళ చరిత్రలో నంగేలి దంపతులు నిలిచిపోయారు, నంగేలి పేరుమీదుగానే ఆ గ్రామానికి "ములచ్చి పురంబు (రొమ్ము కోసిన మహిళ)" అనే పేరు వచ్చింది. నంగేలి మరణం తర్వాత ఆమె కుటుంబ సభ్యుల్ని, బంధువుల్ని అక్కడి నుంచి వెళ్లగొట్టారట. ఈ కథ కేరళ అంతటా ప్రచారంలో ఉన్నప్పటికీ ఆమెకు సంబంధించిన చారిత్రక ఆధారాలేవీ లేవు.

ఈ కథలోని సంఘటన పట్ల చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. నాంగేలి కథ కేవలం స్థానికులు చెప్పుకునే కథగానే మిగిలిపోయింది. అయితే టి మురళి అనే చిత్రకారుడు చెర్తలలో ఆమె కుటుంబాన్ని వెదకడానికి ప్రయత్నించారు. ఆయన ఆమె కథకు సంబంధించిన అనేక బొమ్మలు గీశారు.






No comments:

Post a Comment