రాజస్తాన్ రాష్ఠ్రం లోని అజ్మేర్ లో జరిగిన ఈ సంఘటన యావత్ భారత దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది.
1991,1992 సం" మధ్య కాలంలో అజ్మేర్ లోని ఒక ప్రైవేట్ పాఠశాల మరియు కళాశాలలో చదువుతున్న అమ్మాయిల నగ్న చిత్రాలు( nude photographes)కొంత మంది వ్యక్తుల చేతుల్లో సర్క్యులేట్ అవుతున్నాయి,
91,92 ప్రాంతంలో ఇప్పుడున్న డిజిటల్ కెమెరాలు , ఫోన్ కెమెరాలు అందుబాటులో లేవు ఉన్నదల్లా ఫిల్మ్ రోల్ కెమెరాలు, మనం దిగిన ఫోటో చూడలంటే, ఆ ఫిల్మ్ నెగిటివ్ ని ల్యాబ్ కి పంపి, అక్కడ దాన్ని డెవలప్ చేస్తే ఫోటోని చూడగలిగేవాల్లం అలాంటి సమయంలో పెద్ద మొత్తంలో అమ్మాయిల అశ్లీల చిత్రాలు సర్క్యులేట్ అవుతున్నాయి, మెల్లి మెల్లిగా ఈ విషయం అజ్మేర్ అంతా వ్యాపించింది, పోలిసు అధికారులకి దీని గురించి తెలిసినా వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు, ఆసమయంలో అలా సర్కులేట్ అవుతున్న ఫోటోలు అజ్మేర్ లోని నవజ్యోతి వార్త పత్రిక సంపాదకుడికి చేరాయి,
నవజ్యో్తి ఎడిటర్ చౌదరిపదుల సంఖ్యలో ఉన్న అమ్మాయిల నగ్న చీత్రాలని చూసి నివ్వెరపోయిన ఆయన వాటి వెనక ఉన్న కారణాలని తెలుసుకునే ప్రయత్నంచేయగా,తెలిసిన వీషయం ఏంటంటే ఈ ఫోటలని అడ్డు పెట్టుకుని కొంత మంది వ్యక్తులు ఆ అమ్మయిలని బ్లాక్మెల్ చేస్తున్నారని, వాళ్ళు సమాజికంగా, ఆర్తికంగా పలుకుబడి ఉన్నవాళ్ళు అని, అందుకే పోలిసులు వారిపై ఎలంటి చర్యలు తీసుకునే సాహసం చేయట్లేదు అన్న విషయాన గుర్తించారు, ఎలాగైన ఈ అమానుషాన్ని వెలుగులోకి తీసుకురావలని నిర్ణయించుకున్న నవజ్యోతి వార్తాపత్రిక మర్చ్ 1992లో ఆ ఫోటోలని బ్లర్ చేస్తు వాటీ వెనక దాగున్న చేదు వాస్తవాలతో సంచలన కథనాన్ని ప్రచురించింది, ఆ వర్తతో ఒక్కసారిగా అజ్మేర్ ఉలిక్కిపడింది, నిందితులను అరెస్ట్ చేయాలంటు ప్రజలు దర్నలకు దిగారు, ఇక తప్పదనుకున్న పోలిసులు కేసు నమొదుచేసి నిందితలను అరెస్ట్ చేసారు,కోర్టు శిక్షవిదించింది, ఇది ఒకన్యుస్ పేపర్ ద్వరా వెలుగులోకి వచ్చిన సెక్స్ స్కాండిల్ కి సంబంధించిన సంక్షిప్త సమాచారం, అయితే ఆ ఫోటోల వేనక ఉన్న అసలు కథేంటి?అరెస్ట్ తరువాత జరిగిన పరినామాలేంటో ఇప్పుడు క్షున్నంగా తెలుసుకుందాం.
అజ్మేర్ షరీఫ్ అన్న పేరు వినగానే ముందుగా మనకు గుర్తొచ్ఛేది ఖాజా మొయినుద్దిన్ చుస్తి దర్గా, హిందువులు ముస్లింలు మతాలకి అతీతంగా సందర్శించే పవిత్రమైన చోట, ఈ దర్గా ఖాజా మొయినొద్దిన్ వంశస్తులైన ఖాదింల పర్యవేక్షనలో ఉంటుంది, వీళ్ళు అజ్మేర్ లో మంచి పేరు పలుకుబడి ఉన్న పవర్ ఫుల్ వ్యక్తులు, ఈ ఖాదిం సంబందికులైన అప్పటి అజ్మేర్ యుత్ కాంగ్రేస్ ప్రసిడెంట్ ఫారుక్ చుస్తి, వైస్ ప్రసిడెంట్ నఫీస్ చుస్తి, సెక్రేట్రి అన్వర్ చుస్తిలు ఈ సెక్స్ స్కాండిల్ వెనక ఉన్న మాస్టర్ మైండ్స్.
1991 వ సంవత్సరంలో ఈ ముగ్గురు మొదట సోఫియ బాలికల పాఠశాల & కలాశాలలో చదివే ఒక అమ్మాయిని అమ్మాయిని మబ్బెపెట్టో, బయపెట్టో తమతోపాటు ఊరి చివరున్న తమ ఫామ్ హౌస్ కి తీసుకెళ్ళారు, అక్కడ ఆ అమ్మాయిని రేప్ చేసి కాంప్రమైజ్ పొజీషన్లో అమ్మాయి నగ్నచిత్రాలని తీసి ఈవిషయం ఎవరికైనా చెప్తే నీ ఫోటలను అజ్మేర్ గోడలపైన పోస్టర్లుగా వేస్తాం అని బెదిరించారు, అక్కడితో ఆగకుండా తనతో పాటు తన స్నేహితురాలినికూడా తమవద్దకు తీసుకు రావాలని లేకపోతే ఆ ఫోటోలని బయటపెడతాం అని బ్లాక్మేల్ చేసారు, తన బాదని ఎవరికి చెప్పుకోలేని అమ్మాయి బెదిరింపులకి బయపడి తప్పక తనతోపాటు చదివే తన స్నేహితురాలిని ఆ ఫామ్ హౌస్ కి తీసుకెళ్ళింది, ఆ ముగ్గురు ఈ రెండవ అమ్మాయిని కూడా రేప్ చేసి, నగ్న చిత్రాలను తీసి ఎవరికి చెప్పొద్దని బెదిరించి ఈ అమ్మాయినీ కూడా తన తోటి స్నేహితురాలినీ తమ వద్ధకు తీసుకు రావాలని అదే రీతిలో బ్లాక్మేల్ చేసారు, ఇలా 1వ అమ్మాయి ద్వారా 2 వ అమ్మాయిని 2వ అమ్మాయి ద్వారా 3వ అమ్మాయిని ఇలా చైన్ సిస్టంలా ఒక అమ్మాయి ద్వారా ఇంకో అమ్మాయిని తమవద్దకు రప్పించుకున్నారు, అప్పుడున్న ఇన్వేస్టిగేష రిిపోర్ట్ ల ప్రకారం 150 నుండి 200 మందికిపైగా అమ్మాయిలని వీళ్ళు రేప్ చేసి, న్యూడ్ పిక్చర్స్ ని తీసి, బ్లాక్మేల్ చేసారు, అలా అని ఈ అమ్మాయిలందరు ఏదో సాదరన పిల్లలుకాదు సమాజంలో మంచి పేరు ప్రతిష్ఠలు ఉన్న ఉన్నత కుటుంబాలకి చెందిన వారు, వీళ్ళు తమ పై జరుగుతున్న లైంగిక దాడిని గురించి ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక, బయటకి తెలెస్తే సమాజంలో కుటుంబం పరువు ఏమౌతుందో అని బిక్కు బిక్కుమంటు భయపడే వాళ్ళు, వీళ్ళ భయాన్నే ఆసరాగా చేసుకుని ఆ ముగ్గురు పదే పదే ఈ అమ్మాయిల పైన అత్యాచారం చేసేవాళ్ళు, ఇలా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ అమానుషం అసలు ఎలా లీక్ అయ్యింది?
ఈ ముగ్గురు చుస్తిలు అమ్మాయిల నగ్న చిత్రలను తీయటానికి అప్పుడు ఉన్న ఫిల్మ్ రొల్ కెమెరాలు వాడేవారు, ఆ నెగిటివ్ ని డెవలప్ చేయటానికి నమ్మకస్తుడైన స్నేహితుడి స్టుడియోలో ఆ ఫిల్మ్ రోల్ ని ఇచ్చేవారు, స్టుడియో యజమాని నమ్మకస్తుడే కాని అక్కడ ల్యాబ్ లో పనిచేసే టెక్నీషియన్స్, వర్కర్స్ ఎప్పుడైతే ఈ న్యూడ్ ఫొటోగ్రాఫ్ లని చూసారో, పది కాఫిలు చేయల్సినవి ఇరవై కాపిలు చేసి పది వాళ్ళదగ్గర దాపెట్టుకునేవాళ్ళు, అలా వాళ్ళ దగ్గర ఉన్న పది కాపిలని వాళ్ళ స్నేహితులకి ఇచ్చేవారు, ఆ పది కాపిలు ఇరవై కాపీలు అయ్యేవి ఇరవై కాపీలు నలపై అయ్యేవి అలా ఒకరి నుండి ఒకరికి కొన్ని వందలసంఖ్యలో అమ్మాయిల నగ్న చిత్రాలు సర్క్యూలేట్ అయ్యాయి, దారునం ఏంటంటే అప్పటి వరుకు జరుగుతన్న అత్యాచారాలు నఫీస్, అన్వర్, ఫరుక్ చుస్తిలవరకు మాత్రమే ఉండగా, ఎప్పుడైతే ఆ నగ్న చిత్రలు చాల మంది చేతుల్లోకి వెళ్ళాయో వాళ్ళు ఆ ఫోటలలలోని అమ్మాయిలని గుర్తించి వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఆ అమ్మాయిలను బ్లాక్మెల్ చేయటం మెదలుపెట్టారు, చివరకి ఫారుక్ చుస్తి దగ్గర పనిచేసే పురుషోత్తం అనే పనివాడు కూడా ఆ అమ్మాయిలని బ్లాక్మేల్ చేసినవారిలో ఉన్నాడు, ఒక పక్క ఒక గ్యాంగ్ బ్లాక్మేల్ చేస్తుంటే,మరో పక్క ఈ ఫోటులు ఉన్న వ్యక్తులు అందరు అమ్మాయిలని బ్లాక్మేల్ చేస్తున్నారు, అందులో ఒకరిద్దరు పత్రికా రిపోర్టలు కూడా ఉన్నారు,అంతే కాకుండా ఈ ముగ్గురు కాంగ్రేస్ యూత్ లీడర్స్ కావటంతో వాళ్ళ పైస్థాయి నేతలను, కొంత మంది అధికారులని సంతృప్తిపరచటానికి ఈ అమ్మాయిలను రప్పించేవారు,ఇలా నాలుగు వైపులనుండి అమ్మాయిలపైన తివ్ర వత్తిల్లు వచ్చేవి, ఆ వత్తిల్లకి తట్ఠుకోలేకా సోఫియ స్కూల్ కి చెందిన ఆరుగురు అమ్మాయిలు ఒకరి తరువాత ఒకరు కొంత కొంత కాల వ్యవదిలో ఆత్మహత్యలు చేసుకున్నారు, ఒకే స్కూల్ కి చెందిన ఆరుగురు అమ్మాయిలు అత్మహత్య చేసుకోవటంతో దాని వెనక కారనం ఎంటన్న ప్రశ్న అజ్మేర్ ప్రజల్లో మొదలైంది, ఈ సంఘటనే గుట్టుచప్పుడు కాకుండ జరుగుతున్న ఈ అమానుషం గురించీ తీవ్ర చర్చ జరగటానికి కారణం అయింది, కాని అంతకు ఏడాదికి ముందే ఈ విశయం గురించి అక్కడి పాలకులకి, పోలీసులకి తెలిసినా మూడు కారణాల వలన దీన్ని నొక్కి పెట్టే ప్రయత్నం చేసారు.
1. ఆరోపణలు ఎదుర్కుంటున్న ముగ్గురు ఖాదింలకి సంబందించిన వ్యక్తులు.
2. వీళ్ళు సామాజికంగా, ఆర్తికంగా బలమైన వాళ్ళు.
3. ఇందులో ఎక్కవ మొత్తంలో బాధితులుగా ఉన్నది హిందు మతానికి చెందిన అమ్మాయిలు, నిందితులు ముస్లిం మతానికి చెందిన వాళ్ళు కావటంతో ఎక్కడ అజ్మేర్ లో మతఘర్షనలు జరుతాయో అని ఈ అమానుషం గురించి తమకు తెలిసిన ఎవరు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
కాని ఎప్పుడైతే సర్క్యులేట్ అవుతున్న నగ్నచిత్రాలు నవజ్యోతి వార్తపత్రిక సంపాదకుడికి చేరాయో ఆయన వాటి వెనక కారణాలను తెలుసుకుని ఒక్క సారిగా నివ్వెరపోయడు అప్పటికే ఆరుగురు అమ్మాయిల ఆత్మహత్యలు జరగిన పాలకులు,పోలిసులు స్పందించకపోవటంతో ఆ ఫొటల వేనక ఉన్న వాస్తవాలని ఆత్మహత్యలకు గల కారణాలని ప్రజల్లోకి తీసుకెల్లాలని నిర్నయించుకుని 1992 మర్చ్ లో ఆ ఫోటలని అడ్డు పెట్టుకుని అమ్మాయిలపైన అత్యచారాలు జరుగుతున్నాయనే సంచలన కథనాన్ని ప్రచురించడు, ఆ వార్తతో ఒక్కసారిగా అజ్మేర్ ఉలిక్కిపడింది, ప్రజలు రొడ్లపైకి వచ్చి నిందితులను అరెస్ట్ చేయాలంటు దర్నాలు చేసారు, అజ్మేరులో ముడు రోజులు బంద్ జరిగింది, ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నది యుత్ కాంగ్రేస్ లీడర్స్ కావటం తో నిందితులని శిక్షించాలని బీజేపీ నాయకులు, బిజేపి వాళ్ళ్ళ పైన కాంగ్రేస్ నాయకులు పరస్పర విమర్శలకు దిగారు.
ఈ సెక్స్ స్కాండిలో బాదితులు పెద్ద మొత్తంలో హిందు అమ్మాయిలు, ఆరోపనలు ఎదురుకుటుంది ముస్లింలు అందులోను ఖాదింల సంబందికులు కావటంతో హిందు ముస్లింల మత రంగు పులుముకుంది, దేశవ్యాప్తంగా తీవ్ర దుమారంరేగడంతో, ఎట్టకేలకు ప్రభుత్వం పోలీసులు నిద్ధరలేచి నిందితులను గుర్తించే పనిలో పడ్డారు, ఇప్పడు బాదితులు ముందుకువచ్చి కంప్లయింట్ చేయల్సిన సమయం వచ్చింది, కాని ఎవరు అందుకు సాహసించట్లేదు, ఎందుకంటే పోలీసుస్టేషన్ మెట్లెక్కిన ప్రతి అమ్మాయి రేప్ కి గురి అయ్యిందని ముద్ర పడుతుంది , సమాజంలో కుటుంబం పరువు పోతుంది అనే భయం, ఆ సమయంలో మహిళాసంఘాల అండతో 30 మంది అమ్మాయిలు ధైర్యం చేసి ముందుకి వచ్చారు, కాని నిందితులు పవర్ ఫుల్ వ్యక్తులు కావటంతో కేసు పెడితే మీ కుటుంబం అంతు చూస్తాం అని బాధితులకు బెదిరింపులు మొదలయ్యాయి, ఆ బెదిరింపులకి భయపడి 30 లో 18 మంది వెనక్కి తగ్గారు, మిగిలింది 12 మంది, 12 మంది ధైర్యం చేసి కంప్లయింట్ ఇవ్వగా పోలీసులు కేసు నమోదు చేసారు, కేసు నమోదైన వెంటనే మళ్ళి ఆ 12 మందికి అమ్మాయిలకి బెదిరింపులు మొదలయ్యాయి , భయపడి 10 మంది అమ్మాయిలు వెనక్కి తగ్గారు ఇపుడు మిగిలింది ఇద్ధరు, ఆ ఇద్దరు అమ్మాయిలు ధైర్యంగా తమ కంప్లయింట్ కి కట్టుబడి ఉండటంతో పోలిసులు నిందితలను గుర్తించే పనిలో పడ్డారు, అప్పటికి సర్క్యూలెట్ అయిన ఫోటోగ్రఫ్స్ లో అమ్మాయిలతో పాటు కొన్నింటిలో నిందితులు ఉన్నారు ఆ ఫోటోల సహయంతో 18 మందినీ గుర్తించరు అందులో ఆరుగురు పారిపోయారు , 12 మందిని వెరు వెరు సమయల్లో అరెస్ట్ చేసారు, కోర్ఠలో కేసు నడుస్తుండగా 1994 మార్చ్ 8 న ఫారుక్ చుస్తి పనివాడైన పురుషోత్తం బేయిల్ పైన బయటకి వచ్చాడు, ఆ తరువత ఏమైయ్యడో ఎవరికితెలియదు, కొంత మంది ఆత్మ హత్య చేసుకున్నాడని, మరి కొంత మంది బంగ్లాదేశ్ కి పారిపోయడు అని చెప్పినా ఇప్పటివరకు అతని గురించీ ఎలాంటి అధికారికి సమాచారం లేదు, ఈ ట్రయల్ జలుగుతున్నప్సుడే మరో ఇద్దరు బేయిల్ పైన బయటకి వచ్చి తము చేసిన పనికి సమాజానికి మొహం చూపలేక ఆత్మహత్య చేసుకున్నారు.
ఇక్కడ ఇంకో ఆశ్చర్య పరిచే విషయం ఏంటంటే సెక్స్ స్కాండిల్ కి ప్రధాన కారకుడైన అజ్మేర్ యుత్ కాంగ్రేస్ ప్రసిడెంట్ ఫారుక్ చుస్తి మానసిక స్థితి బాగాలేదన్ని డాక్టర్ సర్టిఫికేట్ ని అతని తరుపు లయర్లు కోర్టులో సమర్పించారు,కోర్టు ఆయన్ని మెంటల్లీ అన్ స్టేబుల్ అని విడుదలచేసింది, ఈ అమానుషం వెనక ఉన్న మాస్టర్ మైండ్ తనకు మైండ్ లేదని పిచ్చివాన్నని చెప్పి తప్పించుకున్నాడు,
*అలా కేసు నత్తనడకన నడుస్తూ సంఘటన జరిగిన ఆరు సంవత్సరాలకి 1998 సంవత్సరంలో సెషన్స్ కొర్ట్ ఎనమిది మందిని దోశులుగా తేల్చీ యావజ్జీవ కారాగా శిక్ష విధించింది.
*తరువాత 2001 లో రాజాస్థాన్ హైకోర్ట్ నలుగురిని నిర్దోషులుగా తేల్చి మరో నలుగురికి యావజ్జీవ శిక్ష కొనసాగించిది.
*2003 లో కేసు సుప్రింకోర్ట్ కి వెళ్ళింది సుప్రింకోర్ట్ మిగిలిన నలుగురి యావజ్జివ కారాగార శిక్షని పది సంవత్సరాకి తగ్గించింది.
*మెంటల్లీ అన్ స్టేబుల్ అని తప్పించుకున్న ఫారుక్ ని 2007 అజ్మేర్ ఫాస్ట్రాక్ కోర్ట్ దోశిగా తేల్చింది, 2013 లో రాజాస్థాన్ హైకోర్ట్ ఈ నిర్నయాన్ని సమర్థించినప్పటికి యావజ్జీవ కారాగార శిక్షను అప్పటికి అతడు అనుభవించిన శిక్షాకాలనికి తగ్గించటంతో ఆయన విడుదలయ్యాడు.
*ఈ కేసుకు సంబంద ఉన్న మరో వ్యక్తి అమెరికాలో ఉన్నాడున్న సమిచిరంతో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినా ఎలాంటి ఫలితం రాలేదు.
*2012 లో అంటే 20 ఏళ్ల తరువాత ఈ కేసులో సంబందం ఉన్న మరొక నిందుతుడడైన సలీమ్ చుస్తీని రాజస్థాన్ పోలిసులు అరెస్ట్ చేసారు, తరువాత బేయిల్ పైన బయటకి వచ్చాడు.
*2018 లో 26 ఏళ్ల తరువాత మరో నిందితుడు సోహేల్ గనీ చుస్తి బుర్కాలో వచ్చి పోలిసులకి లొంగిపోయాడు.
కాని ఇక్కడ బాదకలిగించే విషయం ఏంటంటే ఈ కేసులో ప్రధాన ముద్దాయిలలో ఇపుడు ఏ ఒక్కరు జైల్లోలేరు.
ఇవి ఈ కేసుకి సంబందించిన పూర్తివివరాలు, కాని ఇందులో బాధితులుగా ఉన్న అమ్మాయిల కుటుంబాల పరిస్థితి ఏంటి ?
అజ్మేర్ కి సంబందించిన అమ్మాయిని పెళ్ళి చేసుకోవలంటే అబ్బాయి తరుపువాళ్ళు నేరుగా ఆ వార్త పత్రికల ఆఫీసులకి వెళ్ళి పలానా కుటుంబం వాళ్ళతో సంబందం కలపుకోవాలి అనుకుంటున్నాం మీ దగ్గర ఉన్న నగ్న చిత్రలతో ఈ అమ్మాయి ఉందేము చూసి చెప్పండి అని ఎంక్వయిరీ చేసేవాళ్ళు, అసలు అజ్మేర్ అమ్మాయిలని పెళ్ళి చేసుకోక పోవటమే ఉత్తమం అని భావించేవాళ్ళు,మరో పక్క సోఫియా స్కూల్ లో చదివే ప్రతీ అమ్మాయి తల్లితండ్రులు తమ కూతుర్ల గురించీ ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని బయపడే పరిస్థితి.
ఇక ఈ కేసుని కూడా మరో సామాన్యమైన కేసుల బావించిన మన పాలకుల పోలీసుల న్యాయ వ్యవస్థలు తీరు మరింత బాదకలిగించే విషయం.
ఒక్క రేప్ కి శిక్ష పది సంవత్సరాలు అయితే 200 రేప్ లకీ ఎలాంటి శిక్ష పడాలి,ఈ లెక్కన బాదితులకి న్యాయం జరిగిందా?
ఇలాంటి ఈ అమానుషం మళ్ళి ఎప్పుడు ఎక్కడా జరగవద్దు అని,ఇటువంటి కేసుల్లో దోషులకు కఠినశిక్షలుపడేల మన పాలకులు, పోలీసులు, న్యాయస్థానలు కృషి చేసి త్వరితగతిన బాధితులకి న్యాయం చేయలని ఆశిద్దాం.
No comments:
Post a Comment